కాళియపై కృష్ణ కేళిక

 

కాళియపై కృష్ణ కేళిక


రమణకద్వీపయందు కాలహరి     

కాళింది కొలనులో ప్రవేశించెన్

క్రూర నూటొక్కరత్న పడిగలతో

పశుపక్షాది జీవులన్ హింసించెన్



ఓప్రొద్దు తరళమైన తరణిజ తటాన

గోవిందగోవుగోపబాలులు వినోదించంగ

తుర్ష్ణఐ బాలులు జలత్రాగి మూర్ఛపోవంగా

అదిచూచి ముకుందమరల నృసింహుడాయెన్




కనకకడియము భిగించి

పింఛము జటములో భంధించి   

పరుగులెత్తి మడుగులోకి

ఎగిరెన్ చూడు రౌద్రశ్రమణా



భీకరయుద్ధంజెసి మధస్థానముపై గంతేయగా

పాదపద్మములకు కళింగ శిరస్సు రంగస్థలంబై

ఒకపడిగపై యింకొకపడిగపైకి దూకుచు

తకీటకధిమిధక తకీటకధిమిధకలాడెన్



పడిగరత్నంపై చరణముద్రలిచ్చి

జ్ఞానబోధనచేసి మంచిమార్గము చూపి

పాదస్పర్శతో కొలనశోభ వికసింపజేసి

మరల వృందావనములో వేణువుమ్రోగెన్





-కసుబా నితిన్   

కామెంట్‌లు