ఆచార్య అంటే

 ఆచార్య అంటే 


ఆచార్య అంతానికి అనృతమట  

అస్త్ర శస్త్రాలు పనికిరాలేదట  

అగ్రజునినోట అశ్వద్ధామహతమట 

యోగమార్గముచే కునుకెయునట   





మహాభారత యుద్ధంలో ఒక మహాయోధుడు మరియుడు కురువంశానికి గురువుయైన ద్రోణాచార్య మరణించిన వృతాంతం:

గొప్పయోధుడు, తప సంపన్నుండు అయిన ద్రోణాచార్యని యుద్ధరంగంలో ఎదురుకోవటం అనేది ఒక సాహసమే. అర్జునవంటి విలువిద్య  కలిగినవారుకూడా ద్రోణుడితో యుద్దమంటే ఊపిరి బిగపెట్టుకునేవారు. ఎన్ని అస్త్రాలు, శస్త్రాలు అయిన పనికిరావు. అలాంటి ద్రోణుడి మృత్యువు సాధారణంగా జరగలేదు. అశ్వత్థామ హతః కుంజరః అనే ఒక అబద్ధం పాండవులలో అగ్రజుడు అయిన ధర్మరాజు నోటివెంట రావటంతో, అది విని తక్షణమే ద్రోణుడు అతని ఆయుధాలు వదిలి కుప్పకూలిపోయాడు. సరిఅయిన సమయము అని భావించి ధ్రిష్టద్యుమ్నుడు ద్రోణుడిపైకి బాణం సంధించాడు. ఆ బాణం గ్రుచ్చుకున్న వెంటనే, ద్రోణుడు యోగ మార్గముచే తన ప్రాణంని వదిలేసారు. ఇంత మహార్థరమైన వ్యక్తి కాబట్టే, ఆచార్య అనే బిరుదుతో బోధించబడ్డారు.    


Describing how Dronacharya was killed in the Kurukshetra war
 

As he was a great warrior, he couldn't be killed using any weapons or Vyuha. Finally, he was killed by saying a lie, by Dharmaraja. Immediately after listening to Ashwatthama Hatha-ha Kunjaraha, he left his body by yoga marga and his soul reached Brahma Loka. 

Hence, He was saluted with the great title "Acharya".

కామెంట్‌లు